
సమావేశంలో మాట్లాడుతున్న సీఎంఓ కృష్ణయ్య
సీఎంఓ కృష్ణయ్య
కొత్తూరు: ప్రయోగ్మాతకంగా విద్యాబోధన చేపడితే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంఓ) కృష్ణయ్య సూచించారు. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో పీఅండ్‌జీ పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమ ఆర్థిక సహకారంతో మైండ్ స్పార్క్ సంస్థ సమకూర్చిన కంప్యూటర్ మోడల్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు దృశ్య, వీక్షణ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తే వారికి విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు చాలాకాలం వరకు గుర్తుంటాయన్నారు. కరోనా కారణంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఇలాంటి బోధన ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యాభివృద్ధికి పీఅండ్‌జీ పరిశ్రమ తమ సహకారాన్ని ఎప్పటికీ అందిస్తుందని హెచ్‌ఆర్ డైరక్టర్ ఆశిష్ డొంగారియా, ఆపరేషన్స్ మేనేజర్ అనీష్ కులకర్ణి పేర్కొన్నారు. కార్యక్రమంలో మైండ్ స్పార్క్ సంస్థ ప్రతినిధి విశ్వనాథ్, ఎంఈవో కృష్ణయ్య, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment