![Police constable End His Life In Yacharam At Rangareddy District - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/30/13.jpg.webp?itok=eP3O215_)
యాచారం: కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రం గారెడ్డి జిల్లా యాచా రంలో చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథ నం ప్రకారం.. నల్లగొండ జిల్లా డిండి మం డలం ఖానాపూర్‌కు చెందిన మల్లికార్జున సైదు లు (30) మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబు ల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా కొండమల్లెపల్లికి చెందిన ఓ యువతితో డిసెం బర్ 18న వివాహం జరిగింది. అనంతరం దంపతులు మర్రిగూడలో నివాసం ఉంటు న్నారు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్ప ర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర మన స్తాపం చెందిన సైదులు.. సోమవారం సాయం త్రం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పోలీస్ డ్రెస్‌తో బైక్‌పై బయలుదేరాడు. భార్య చున్నీని వెంట తెచ్చుకున్నాడు. మర్రిగూడ ఠాణాకు వెళ్లకుండా యాచారం వచ్చాడు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో సోమవారం రాత్రి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. యాచారం పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడిని సైదులుగా గుర్తించారు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకో వడం, వివాహమైన మూడు నెలలకే భర్త కాన రాని లోకాలకు వెళ్లడంతో మృతుడి తల్లిదం డ్రులు, భార్య రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment