
చింతపట్లలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న డీఆర్‌డీఓ పీడీ ప్రభాకర్
యాచారం: జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పిస్తామని డీఆర్‌డీఓ పీడీ ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎన్ని గంటలకు పనులకు వస్తున్నారు, పనులు ప్రారంభించే సమయంలో, పనులు చేసే సమయంలో ఫొటోలు తీస్తున్నారా.. నింబంధనల ప్రకారం పనులు చేస్తున్నారా.. రికార్డుల నమోదు, కూలీల సంఖ్యపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా వారానికి మూడు రోజుల పాటు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోజూ 7 వేల మందికి పైగా కూలీలకు ఉపాధి పనులకు వస్తున్నారని తెలిపారు. రాబోయే వారం, పది రోజుల్లో ప్రతి గ్రామంలో 250కి మించి కూలీలు ఉపాధి పనులు చేసేలా చైతన్యం కల్పిస్తామన్నారు. కూలీలకు వారం, వారం డబ్బులు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ పీడీ ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment