
రంగారెడ్డి: యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 33 కేవీ విద్యుత్ టవర్లను తక్కళ్లపల్లి గ్రామస్తులు కూల్చివేస్తున్నారు. అధికారులు నిన్న(శుక్రవారం) పోలీస్ బందోబస్తు మధ్య విద్యుత్ టవర్ల ఏర్పాటు చేశారు.
మీర్‌ఖాన్‌పేటలోని అమెజాన్ సంస్థ కోసం తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు టవర్ ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్ టవర్ల ఏర్పాటుపై తక్కళ్లపల్లి గ్రామస్తుల అభ్యంతరం చేశారు. తమ గ్రామం మీదుగా 33 కేవీ లైన్లు ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు.