ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి | YSRCP Rangareddy district president Suresh reddy protest | Sakshi
Sakshi News home page

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి

Published Mon, May 18 2015 6:38 PM | Last Updated on Mon, Aug 27 2018 8:39 PM

YSRCP Rangareddy district president Suresh reddy protest

రంగారెడ్డి (కుత్బుల్లాపూర్) : రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లో కాలువను ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సాఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి సోమవారం ఆందోళనకు దిగారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సుభాష్‌నగర్‌లో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు నాలా కబ్జా విషయంపై ఫిర్యాదు చేశారు. వెంటనే వారికి మద్దతుగా సురేష్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించి నోడల్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో కాలువ ఆక్రమణపై విచారణ జరిపిస్తామని నోడల్ అధికారి హామీ ఇవ్వగా ఆందోళన విరమించి స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement