సాక్షి, కొత్తూరు: ఎంపీ రేవంత్‌రెడ్డి తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు దీక్షలో పాల్గొనేందుకు మంగళవారం షాద్‌నగర్ వెళ్తున్న ఆయనకు మండల పార్టీ అధ్యక్షుడు జే. సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో వీర్లపల్లి శంకర్ తదితరులు తిమ్మాపూర్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. కాగా పార్టీలోని మరో వర్గం నేత కే. శ్రీనివాస్‌గౌడ్ సైతం రైతులకు మద్దతుగా మండల కేంద్రంలోనే ధర్నా చేపట్టారు. ఈ శిబిరం పక్క నుంచే రేవంత్‌రెడ్డి వెళ్లినప్పటికీ తమను పట్టించుకోకపోవడంతో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిపై ఉందని, స్థానిక నేతలు కొందరు ఆయనను శిబిరం వద్దకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment