బరితెగింపు
- అసత్య ప్రచారాలకు తెరలేపిన టీడీపీ
- పందాలకు రమ్మని.. మొహం చాటు
- వాస్తవాలను జనం పసిగట్టడంతో కలవరం
సాక్షి, ఏలూరు: మునిసిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు సమయం ఆసన్నమైంది. చివరి నిమిషంలో అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణలతో టీడీపీ నేతలకు దిమ్మతిరుగుతోంది. దీంతో ఓటర్లను ఓ వైపు ప్రలోభపెడుతూనే మరోవైపు అసత్య ప్రచారాలను ఆ పార్టీ నేతలు ముమ్మరం చేశారు. అన్నిచోట్లా తమదే పైచేయి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. అనుమానం ఉంటే పందెం కాయండంటూ రెచ్చగొడుతున్నారు. చివరకు టీడీపీ సృష్టించిన మబ్బులు వీడుతున్నాయి.
ఆ పార్టీ చేస్తున్న కుట్రలను గ్రహించిన ఓటర్లు వైసీపీ వైపు మళ్లుతున్నారు. ఆఖరి క్షణంలో తమ ఎత్తులు జనం పసిగట్టారని తెలిసి పార్టీవర్గాలు కలవరపడుతున్నాయి. వార్డుల్లో టీడీపీ నేతల బరితెగింపు తారస్థాయికి చేరుకుంది. పంచాయతీ ఎన్నికల్లో చేసిన విధంగానే మైండ్‌గేమ్ ఆడుతున్నారు. అప్పట్లో పంచాయతీలన్నీ తమ ఖాతాలోకే వచ్చేస్తున్నాయని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఫలితాలు వెలువడ్డాక వాస్తవం ఏమిటనేది ప్రజలకు తెలిసింది.
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడమే కాకుండా ఓట్లను సైతం గల్లంతు చేశారు. ఆ తర్వాత సహకార ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని అవలంభించారు. తమకు అనుకూలంగా లేని సహకార సంఘాల్లో రైతుల ఓట్లు సైతం తొలగించారు. కొన్నిచోట్ల లేని ఓట్లు సృష్టించారు. అప్పుడూ అన్నిచోట్లా తమదే గెలుపు అని గొప్పలు చెప్పుకున్నారు. చివరకు చతికిలపడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ అభ్యర్థులే ఏకైక లక్ష్యంగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తస్మదీయులు కుటిల రాజకీయాలుఉపయోగించి ఎత్తులు వేశారు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ లేకపోయినా ఏకపక్షంగా గెలిచేస్తామంటూ ప్రచారానికి తెరలేపారు. అనుమానం ఉంటే పందెం కాయండం టూ సవాలు విసిరారు. తీరా పందానికి సిద్ధమైతే పత్తాలేకుండా పోతున్నారని కొం దరు వెల్లడించారు.
విజ్ఞులైన ఓటర్లు టీడీపీ కుతంత్రాలను చివరి నిమిషంలో పసిగట్టారు. దీంతో పురపోరులో అనూహ్య పరి ణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేత ల అంచనాలు తారుమారు కానున్నాయి. జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టేం దుకు సిద్ధపడుతున్నారు. తామెంత తప్పు డు ప్రచారం చేసినా, విచ్చలవిడిగా డబ్బు లు వెదజల్లినా జనం వైసీపీ వైపు మొగ్గుచూపడం టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
పోలింగ్‌కు రెండురోజుల ముం దు తమ ఎత్తులు చిత్తవడంపై ఆ పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఏలూరు నగరపాలక సంస్థతోపాటు అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ చెప్పింది, చేసింది అవాస్తవమనే విషయూలను గ్రహించి వైఎస్సార్ పార్టీ అభ్యర్థులకు పట్టం గట్టేందుకు ఓటర్లు ముందుకు వస్తున్నారు.