జగన్‌తోనే సంక్షేమం సాధ్యం
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లన్ :
రాష్ట్రంలో విశ్వసనీయమైన జనరంజక పాలన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహనరెడ్డి ద్వారానే సాధ్యమని బందరు,గుడివాడ, పెడన నియోజకవర్గ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం వైఎస్సార్‌సీపీలో భారీగా చేరారు.
బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కుక్కల విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) సమక్షంలో బందరు పట్టణం 22వ వార్డు ఫతుల్లాబాద్‌కు చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబోయిన జగన్నాధంతో పాటు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
రానున్న మున్సిపల్, జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సీలింగ్‌ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా ఓటర్లను చైతన్యపరచి అభ్యర్థులకు అఖండ విజయాన్ని చేకూర్చేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అర్భన్‌బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, 22వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ముస్తాఫా(అచ్చేబా), మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కరరావు, మాదివాడ రాము, ఎస్‌కే జలీల్, ఎండీ పాషా, ఖాజాబేగ్, మీర్ నజాప్‌అలీ, సయ్యద్‌మెహముద్, జగన్, మాడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాంత టీడీపీ కార్యకర్తలు శేషగిరి, భట్రాజు బాబ్జీ, గోవాడ శివాజీ, రాజు, గడ్డం జయరాం, భట్రాజు వీరాస్వామి, మాడపాటి సుబ్రహ్మణ్యం, పవన్, బోయిన నాగరాజు, భట్రాజు శ్రీను, రమణ, చేబోయిన వీరభద్రరావు, తోట నాంచారయ్య, సాయిల ఆండాలమ్మ, శ్రవణం ఉషారాణి, జినిత్, జీ గంగాభవాని తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు.
వైఎస్సార్‌సీపీతోనే పట్టణాభివృద్ధి: కొడాలి
గుడివాడ : జననేత జగన్ నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీతోనే గుడివాడ పట్టణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొడాలిశ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు.
స్థానిక 9వ వార్డులోని శేగు టవర్స్ వద్ద పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులతోపాటు, పట్టణ టీడీపీ, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో చేరిన వీరందరికీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన పార్టీ కండువాలను వేశారు.
పార్టీలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరపతయ్య, పోకూరి మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధిచెందాలంటే జగన్, కొడాలినానిని గెలిపించాలన్నారు. గుడివాడ మున్సిపల్,సాధారణ ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటిస్తున్నామని వివరించారు.
పార్టీలో చేరిన వారు వీరే....
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దుడ్డు వెంకటేశ్వరరావు (చిన్నా), ఆర్యవైశ్య మహాసభ సభ్యుడు బొగ్గరపు తిరపతయ్య, ఆర్యవైశ్య కళ్యాణ మందిర అధ్యక్ష, కార్యదర్శులు పోకూరి మోహనరావు, తిరువీధి శ్రీరాములు నాయకత్వంలో ఆర్యవైశ్య ప్రముఖులంతా పార్టీలో చేరినట్లు ప్రకటించారు.
కాగా కాపు యువత పట్టణాధ్యక్షుడు ఆవుల నరేంద్ర, తెలుగుయువత నాయకులు తోట రాజశేఖర్ నాయకత్వం లో 56 మంది యువకులు, యూత్ కాంగ్రెస్ నాయకుడు టంకాల రామకృష్ణ నాయకత్వంలో 10 మంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సబ్యులు మండలి హనుమంతరావు, డాక్టర్ ఎం.విజయకుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాసచక్రవర్తి, పల్లంట్ల శ్రీను, పి.రమణ, పి.రమేష్, పి.ఆంజనేయులు పాల్గొన్నారు.
జోగిరమేష్ అనుచరుల చేరిక....
బంటుమిల్లి : పెడన నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు జోగి రమేష్ అనుచరుడు, అర్తమూరు గ్రామ మాజీ సర్పంచి బొర్రా రమేష్ తన అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యార్లగడ్డ శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
వార్డుసభ్యులు జి. పార్వతి, వై. భాగ్యలక్ష్మి, డి. కోటేశ్వరరావు, ఆర్. శ్రీనివాసరావు, జి. పద్మావతితోపాటు 400 మందికి పైగా పార్టీలో చేరారు. మలిశెట్టి రాజబాబు, కందుల నాగేశ్వరరావు కాగిత జయరాం, కె. రాఘవులు, బి. ప్రసాదు తదితరులున్నారు.