నెలిమర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయూరైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయా లంటే ఎంతోమంది నేతలు సిఫారసు చేయాల్సి వచ్చేది.. పార్టీ టిక్కెట్ కావాలంటే నేతల మద్దతుతో పాటు కొన్ని సందర్భాల్లో కొంత మొత్తం కూడా చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. నేతలు కోరుండి టిక్కెట్లు ఇస్తామన్నా..అభ్యర్థులు దొరకడం లేదు. నెల్లిమర్ల మండలంలోని 26 పంచాయతీలకు మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అభ్యర్ధులు దొరకలేదు. నిన్న మొన్నటి వరకు కనీసం ఐదారు స్థానాల్లోనైనా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని ఆ పార్టీ నేతలు ఆశిం చారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిం ది. దీంతో గెలుపు మాట అటుంచితే..కనీసం ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ నుంచి ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం మండలం నుంచి కేవలం ఐదు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యూరుు.
పూసపాటిరేగలో 21 ఎంపీటీసీ స్థానాలుండగా.. ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. వైఎస్సార్ సీపీ, టీడీపీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు మండలాల్లో డిపాజిట్లు కడతామని పార్టీ నేతలు ముందుకొచ్చినా అభ్యర్థులు ముందుకు రా వడం లేదు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలోని భోగాపురం, డెంకాడ మండలాల్లోనూ నెలకొం ది. భోగాపురం మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు మూడు రోజులుగా కేవలం ఐదు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖల య్యాయి. డెంకాడ మండలంలోనే కాస్త మెరు గ్గా కాంగ్రెస్‌పార్టీ తరుపున నామినేషన్లు పడ్డా యి. ఇక్కడ ఇప్పటిదాకా పదిస్థానాలకు నామినేషన్లు పడ్డాయి. నామినేషన్లు వేసేందుకే అభ్యర్థులు దొరక్కపోతే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయ్యో పాపం.. కాంగ్రెస్!
Published Thu, Mar 20 2014 3:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement