విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికలకు బుధవారం భారీగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు గురువారం... తిధి చవితి కావడంతో ముందుగానే చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు క్యూకట్టారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులతో జిల్లా పరిషత్ కార్యాలయం కిక్కిరిసిపోయింది.
బుధవారం జెడ్పీటీసీ స్థానాలకు 73, ఎంపీటీసీ స్థానాలకు 1,423 మంది నామినేషన్లు వేశారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎన్. మోహన్‌రావు,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నారాయణరాజు, శ్యామ్ సుందర్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఉదయం 10.30 గంట ల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.
జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున 15 మంది, టీడీపీ తరుపున 40 మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 12 మంది, లోకాసత్తా , బీజేపీ ,సీపీఎం తరఫున ఒక్కొక్కరు, స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 377 మంది, సీపీఎం -28 మంది, సీపీఐ ఒకరు, లోక్‌సత్తా ఒకరు, కాంగ్రెస్ - 336 మంది , టీడీపీ తరఫున 606 మంది, స్వతంత్ర అ భ్యర్థులుగా 74 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేయడానికి గురువారం చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
భారీగా నామినేషన్లు
Published Thu, Mar 20 2014 3:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement