
ప్రచారం హోరు
- మున్సిపల్ ప్రచారానికి గడుపు మరో అయిదు రోజులే
- నర్సీపట్నం, యలమంచిలిలో ప్రలోభాలకు యత్నాలు
- బరిలో మొత్తం 143 మంది
- రేయింబవళ్లు అభ్యర్థుల ప్రచారం
- వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఆపసోపాలు
సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ ఎన్నికల ప్రచా రం ముగింపునకు గడువు ముంచుకొస్తోంది. 30న జరగనున్న పోలింగ్‌కు రెండురోజుల ముందే ప్రచారం ముగించాల్సి ఉన్నందున పార్టీలు సర్వశక్తులూ పణంగా పెట్టి ప్రచారం చేస్తున్నాయి. వార్డులు హోరాహోరీ ప్రచారంతో హోరెత్తుతున్నాయి. నర్సీపట్నం,ఎలమంచిలి మున్సిపాల్టీల్లో మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఎవరికివారు పార్టీనేతల సహాయంతో అవిశ్రాం తంగా ప్రచారం తీవ్రం చేస్తున్నారు.
పనిలో పనిగా ఓటర్లను ప్రభావితం చేయడానికి తెరవెనుక ఏర్పాట్లు సాగుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ఏర్పాట్లు సాగుతున్నా, ఎన్నికలకోడ్ పేరుతో నిఘా గట్టిగా ఉండడంతో రాత్రి రంగంలోకి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్సార్‌సీపీ ఊహించనివిధంగా రెండుమున్సిపాల్టీల్లో దూసుకుపోతూ ఉండడంతో అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం తీవ్రం చేస్తున్నారు.
పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఈరెండు మున్సిపాల్టీల్లో మంగళవారం నుంచి ప్రచారానికి వస్తూ ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చేట్టు కనిపిస్తోంది. ఆయన రాకతో కచ్చి తంగా రెండు మున్సిపాల్టీల్లో వైఎ స్సార్‌సీపీ విజయఢంకా మోగించనుందని కార్యకర్తలు ఉత్సాహంగా చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎ స్సార్‌సీపీ-టీడీపీ మధ్యేనన్నది విస్పష్టం. విజయావకాశాలు వైఎస్సార్‌సీపీకే ఉండడంతో టీడీపీ నేతలకు ఏంచేయాలో అర్థం కావడంలేదు. దాంతో పార్టీ బలహీనంగా ఉన్న వార్డులలో సీనియర్ నేతలు ప్రచారానికి వస్తున్నారు. నర్సీపట్నంలో పార్టీ సీనియర్‌నేత అయ్యన్నపాత్రుడు వార్డు అభ్యర్థుల కన్నా ఎక్కువగా ప్రచారం చేస్తుండడం విశేషం. నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ మరింత బలపడడంతో గట్టి పోటీ ఇవ్వాలన్న పట్టుదలతో అయ్యన్న నేతృత్వంలో పార్టీ నాయకులు పని చేస్తున్నారు.
తమకు వ్యతిరేకంగా ఉన్న వార్డుల్లో ఓటర్లపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కూడా యత్నిస్తున్నారన్న విమర్శలు ఉ న్నాయి. ఎలమంచిలిలోనూ వైఎస్సార్‌సీపీకి అడ్డుకట్ట వేయాలన్న ఆరాటంతో టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. అందుకే ఇటీవల పార్టీలో చేరిన కన్నబాబురాజు ఆదివారం నుంచి స్వ యంగా ప్రచారం మొదలుపెట్టారు.
పోలీసుల నిఘా తీవ్రతరం
గడచిన కొన్నిరోజులుగా పోలీసులు రెండుమున్సిపాల్టీల్లో నిఘా మరింత తీవ్రం చేశారు.ఈప్రాంతాలకు వచ్చిపోయే మార్గాల్లో చెక్‌పోస్టులు పెంచారు.ఇప్పటివరకు గ్రామీణప్రాంతంలో సుమారుగా రూ. 51 లక్షల నగదు స్వాధీనంచేసుకున్నారు.నర్సీపట్నం,ఎలమంచిలో సమస్యాత్మకప్రాంతాలు ఎక్కువగానే ఉన్ననేపథ్యంలో అనకాపల్లి,సబ్బవరం ఇతర ప్రాంతాలనుంచి ఈనెల 28 రాత్రికి అదనపు బలగాలను దింపనున్నుట్టు ఎస్పీ దుగ్గల్ వివరించారు. పోలింగ్‌రోజున వీడియోలతో పోలింగ్‌స్టేషన్ల వద్ద నిఘా పెంచనున్నారు.