తెగ పంచారు
- యథేచ్ఛగా సాగిన ప్రలోభాల పర్వం
- రంగంలోకి దిగిన లిక్కర్ లాబీలు
- పాలకొల్లులో గరిష్టంగా ఓటుకు రూ.3 వేలు
- తాడే పల్లిగూడెంలో టీడీపీ నేతలకు పోలీసుల సహకారం !
సాక్షి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రజాదరణ మెండుగా ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పతాక స్థా యిలో ప్రలోభాలకు తెరతీశాయి. చీరలు, బిందెలు, వెండి వస్తువులు, కరెన్సీ నోట్లు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశాయి.
ఎన్నికల మంత్రాంగంలో ఎంతో అనుభవం ఉండి, ప్రలోభాల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆరితేరిన నాయకులంతా కలిసి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచే పలు మునిసిపాలిటీల్లో టీడీపీ, దాని మిత్రపక్షాల నేతలు చివరి మంత్రాంగాలను కొనసాగించారు. ఈ ఎన్నికలు రాజకీయం గా జీవన్మరణ సమస్యగా భావిస్తున్న ఆయా పార్టీల నేతలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముం దుకు సాగారు. ఇవేమీ పట్టని వైఎస్సార్ సీపీకి చెందిన అధికశాతం మంది అభ్యర్థులు ఓటరు దేవుళ్లపైనే ఆధారపడి ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు.
డబ్బు వెదజల్లారు
2005 ఎన్నికల్లో అధిక శాతం మునిసిపాలిటీల్లో ఓటమి పాలైన టీడీపీ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముం దే క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వైఎస్సార్ సీపీ బలాన్ని అంచనా వేసుకుంది. ప్రజలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కీలక సమయంలో ప్రలోభాలపైనే దృష్టిపెట్టారు. విజయావకాశాలను ప్రభావితం చేసే వర్గాల ఓటర్లను, స్వతంత్ర అభ్యర్ధులను తమవైపు తిప్పుకునేందుకు నానాతంటాలు పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా పార్టీ శ్రేణుల్ని పంపి ఓట్లు కొనుగోలు చేయించారు.
ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీల్లో ఇప్పటికే నగదు పంపిణీ పూర్తయ్యింది. ఒక్కో ఓటుకు రూ.వెయియ వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. పాలకొల్లులో ఒకట్రెండు వార్డుల్లో గరిష్టంగా ఓటుకు రూ.3 వేల వరకూ పంపిణీ చేసినట్లు తెలి సింది. తాడేపల్లిగూడెంలో రూ.500 వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులు గరిష్టంగా రూ.25 లక్షల వరకూ ఖర్చు చేశారు.
తాడేపల్లిగూడెంలోని ఒకరిద్దరు పోలీసు అధికారులు తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పూర్తి సహకారం అందిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగాను, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రతి కూలంగాను వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎక్కువ మం దిపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీ సులు టీడీ పీ నేతలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
తాడేపల్లిగూడెం టూటౌన్ ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ అభ్యర్థినుంచి రూ.8 లక్షలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు ఓ ప్రధాన నాయకుడు ఫోన్ చేయడంతో ఆ మొత్తాన్ని తిరిగి అప్పగించేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. జంగారెడ్డిగూడెంలోని 12 వార్డుల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొం ది. భీమవరం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీల్లోనూ ప్రలోభాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయానికి చివరి విడత పంపిణీని పూర్తి చేసేందుకు అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు.
ఊపందుకున్న లిక్కర్ లాబీలు
ఇదిలావుండగా చాలాచోట్ల లిక్కర్ లాబీలు రంగంలోకి దిగాయి.పలువురు అభ్యర్థులు ఊరి శివార్లలోని దాబాల్లో శిబి రాలు నడిపారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో శనివారం మధ్యాహ్నం నుంచి దాబాల్లో మకాంవేసి వర్గాల వారీ ఓటర్ల లెక్క లు తీసి కొత్త సమీకరణలకు మంత్రాంగాలు నడిపారు. కొవ్వూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం మునిసిపాలిటీల్లో కొందరు నేతలు విందు రాజకీయాలు నిర్వహిం చారు. కీలకమైన వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసే వివిధవర్గాల నాయకుల్ని విందుకు ఆహ్వానించి ఆయా వర్గాల ఓట్లకు పెద్దఎత్తున గాలాలు వేసినట్లు సమాచారం.