ఖమ్మం: త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీకి కాంగ్రెస్, టీడీపీతో పొత్తులు ఉండవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఐతో పొత్తు పెట్టుకునేందుకు ఇరు పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నామన్నారు.
బలమున్న చోట సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీతో, సామాజిక సేవా సంస్థలు, ఉద్యమ సంఘాల నాయకులతో మాట్లాడి సమన్వయంతో పోటీలో ఉంటామని తమ్మినేని వివరించారు. డబ్బే రాజకీయాలను శాసించడం విచారకరమని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమం చేయాల్సి వస్తుందని, అందుకు సీపీఎం సన్నద్ధం అవుతుందని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీతో పొత్తు ఉండదు: తమ్మినేని
Published Sun, Feb 14 2016 3:53 AM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM
Advertisement
Advertisement