టీడీపీ సూట్‌కేసుల పార్టీ | suitcase Party in TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ సూట్‌కేసుల పార్టీ

Published Thu, Apr 10 2014 4:01 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

టీడీపీ సూట్‌కేసుల పార్టీ - Sakshi

టీడీపీ సూట్‌కేసుల పార్టీ

కంటతడి పెట్టిన మొవ్వా

‘కుటుంబాన్ని వదిలి పార్టీయే సర్వస్వంగా పనిచేస్తే డబ్బులకు అమ్ముడుపోయిన పార్టీ నన్ను దూరం పెట్టింది’ అని శేరిలింగంపల్లి టీడీపీ ఇన్‌చార్జి మొవ్వా సత్యనారాయణ కం టతడి పెట్టారు. శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం సన్నిహితులు, కార్యకర్తలతో మియాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై అభిప్రాయాలనుసేకరించారు. ‘పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి సర్వస్వం కోల్పోయాను.

చివరకు మొండిచేయి చూపారు. టీడీపీ సూట్‌కేసుల పార్టీలా తయారైంది’ అని వ్యాఖ్యానిస్తూ మొవ్వా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు కంటతడి పెట్టారు. అనంతరం మొవ్వా మాట్లాడుతూ- కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఏ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లు, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు ఈ సందర్భంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement