జెడ్పీటీసీ బరిలో 338 మంది | In pursuance of the ring 338 | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ బరిలో 338 మంది

Published Tue, Mar 25 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

జెడ్పీటీసీ బరిలో 338 మంది

జెడ్పీటీసీ బరిలో 338 మంది

  • ఎంపీటీసీ స్థానాలకు 3042 మంది పోటీ
  •      జెడ్పీటీసీకి అర్హత పొందిన నామినేషన్లు 611
  •      ఉపసంహరించుకున్న వారు 273
  •      ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు
  •  జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఈనెల 17నుంచి 20వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో జెడ్పీటీసీ స్థానాలకు 785 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న జరిగిన నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాలతో 23 తిర స్కరణకు గురయ్యాయి. ఇందులో పది మంది అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోగా మహబూబాబాద్ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న జెన్నారెడ్డి వెంకటేశ్వర్లు నామినేషన్‌ను ఆమోదించారు.

    50 జెడ్పీటీసీ స్థానాలకు 785 నామినేషన్లలో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ సెట్లు వేసిన వారిని అధికారులు మినహాయించారు. దీంతో నామినేషన్ల సంఖ్య 611కు చేరింది. ఇందులో 273 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోగా 338 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. బీ-ఫారంలు 232 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి దాఖలు చేశారు. మిగిలిన 106 మంది అభ్యర్థులను స్వతంత్రులుగా భావించి రాత్రి పొద్దుపోయాక గుర్తులు కేటాయించారు. జిల్లాలోని 705 ఎంపీటీసీ స్థానాలకు ఉపసంహరణ అనంతరం 3,042 మంది బరి లో ఉన్నట్లు తెలిసింది.
     
     పోటీలో అసంతృప్తులు...

    పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు పలువురు బరిలో ఉన్నారు. జనగామ జెడ్పీటీసీగా తన భార్యకు టికెట్ రాకపోవడంతో అధికార పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లింగాలఘనపురం లో సీనియర్లను వదలి జూనియర్‌కు టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో రెబల్‌గా రంగంలోకి దిగా రు.

    తాడ్వాయి మండలంలో జెడ్పీటీసీగా పార్టీ బీ-ఫారాలను ఇద్దరు దాఖలు చేయడంతో రెబల్ అభ్యర్థి కూడా పోటీలో మిగిలారు. పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే బీ-ఫారంలు ఇచ్చారు. కొత ్తగా చేరిన వారి వర్గానికి టికెట్లు దక్కకున్నా బరిలో నిలి చారు. కాగా, జెడ్పీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను కార్యాలయ నోటీసు బోర్డులో చూసుకోవాలని ఆర్‌ఓ నాయక్ సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement