టికెట్ల కోసం తమ్ముళ్ల సిగపట్లు | Younger thank for tickets | Sakshi
Sakshi News home page

టికెట్ల కోసం తమ్ముళ్ల సిగపట్లు

Published Mon, Mar 24 2014 4:04 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

టికెట్ల కోసం తమ్ముళ్ల సిగపట్లు - Sakshi

టికెట్ల కోసం తమ్ముళ్ల సిగపట్లు

  •     పార్టీకి పనిచేయని వారికి టికెట్లు ఎలా ఇస్తారు
  •      మాజీ మంత్రుల ఎదుట తంబళ్లపల్లె పంచాయతీ
  •      మదనపల్లె నాయకుడిపై కార్యకర్తల ఆగ్రహం
  •  బి.కొత్తకోట, న్యూస్‌లైన్: పార్టీ టికెట్ల వ్యవహారంపై తంబళ్లపల్లె తెలుగు తమ్ముళ్లు మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయు డు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎదుట శివాలెత్తారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఈ వ్యవహారంలో మదనపల్లెకు చెందిన పార్టీ నాయకుడి పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో విరుకుచుపడ్డారు. ఆదివారం మదనపల్లె రెడ్డీస్‌కాలనీలోని ఓ మిల్లు లో మదనపల్లె టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ మంత్రులు హాజరయ్యారు.

    ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు కోసం తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు మదనపల్లెకు రావాలని ఆహ్వానం పలికారు. దీంతో బి.కొత్తకోట, తంబళ్లపల్లె, ముల కలచెరువు మండలాలకు చెందిన నాయకులు సొసైటీకాలనీలోని శంకర్ కార్యాలయానికి తరలివచ్చారు.  మాజీ మం త్రులు వచ్చారనే విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లారు. ముద్దుకృష్ణమనాయుడు, గోపా లక్రిష్ణారెడ్డి వెలుపలకు వస్తుండగా కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టా రు. పార్టీలో ఒక్కరోజైనా పనిచేయని చల్లపల్లె భాస్కర్‌రెడ్డికి తంబళ్లపల్లె జెడ్పీటీసీ టికెట్‌ను ఎలా ఇస్తారని నిలదీశా రు.

    పార్టీకి చెందని వ్యక్తులకు ఎంపీటీసీ టికెట్లు ఇస్తున్నారని, ఇంతకాలం పార్టీకి పనిచేసిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇంతలో తంబళ్లపల్లె వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మదనపల్లె నాయకుడిపై విరుచుకుపడ్డారు. సింగిల్‌విండో, సర్పంచ్ ఎన్నికల్లో తమకు ముష్టి ఇచ్చినట్టు చేతులు దులుపుకున్నారని దుమ్మెత్తిపోశారు. దీనిపై తేరుకొని మాజీమంత్రులు సోమవారం గౌనివారి శ్రీనివాసులు తంబళ్లపల్లెకు వచ్చి సమస్యలు తీరుస్తారని అక్కడి నుంచి శంకర్ కార్యాలయానికి వచ్చేశారు.

    అప్పటికే బి.కొత్తకోట జెడ్పీటీసీ టికెట్ వ్యవహా రంపై నిలదీసేందుకు నాయకులు వేచి ఉండగా టికెట్ విషయంలో సర్వే జరుగుతోందని, ఎవరికి అనుకూలమైన ఫలి తాలోస్తే వారికి టికెట్ ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ పర్వీన్‌తాజ్ కలుగజేసుకున్నారు. దశా బ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారి గతేం టని ప్రశ్నించారు. మీరు జెడ్పీ చైర్మన్ స్థాయి వ్యక్తని చెప్పడంతో అసహనానికి గురైన ఆమె తాను జెడ్పీటీసీ స్థాయి వ్యక్తేనని, పెద్దహోదా అవసరంలేని సమాధానమిచ్చారు. బీసీలు, మైనార్టీల మద్దతు పార్టీకి అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో సమావేశం పూర్తికాకనే మాజీ మంత్రులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
     
    ముందే ఖరారు చేసి ముచ్చట్లు
     
    బి.కొత్తకోట జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో అభ్యర్థులను ముందే ఖరా రు చేసుకున్న నాయకులు ఆశావహుల తో మొక్కుబడి చర్చలు జరిపారు. మదనపల్లెలోని శంకర్ కార్యాలయంలో తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు జీ.శంకర్ యాదవ్, మదనపల్లె నాయకులు మల్లికార్జుననాయుడులు ఆశావహులతో వేర్వేరుగా చర్చించారు. టికెట్ ఎవరికిచ్చినా పని చేయాలంటూ మొక్కుబడి గా మాట్లాడి పంపారు. దీనిపై టికెట్లు ఆశిస్తున్న నాయకులు  అసంతృప్తికి గురయ్యారు. బీ.ఫారాలు దగ్గరే పెట్టుకుని నాటకాలాడుతున్నారని, మమ్మల్ని తి ప్పించుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement