muddukrsnama Naidu
-
టీటీడీ చైర్మన్ పీఠంపై స్థానికుడా.. స్థానికేతరుడా?
ఎన్నికలకు ముందే తనకు హామీ ఇచ్చారంటున్న చదలవాడ పార్టీ కోసం పనిచేసిన తనకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ‘గాలి’ పట్టు తనను టీటీడీ చైర్మన్ చేయాలంటున్న రాయపాటి! రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మంత్రాంగం టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. తనకే ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి పట్టుబడుతున్నారు. మరోవైపు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆ పదవి కోసం తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ సహా అన్ని దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాంతో టీటీడీ పాలక మండలి ఖాళీ అయ్యింది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ టీడీపీ టికెట్ కోసం చదలవాడ కృష్ణమూర్తి, ఎం.వెంకటరమణ పోటీపడ్డారు. ఎమ్మెల్యే టికెట్‌ను వెంకటరమణకు ఇచ్చిన చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ పదవిని చదలవాడకు ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు చదలవాడ వర్గీయులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెం దిన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాలపాటు పనిచేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాయపాటి ఆ పదవిని దక్కించుకోవడం విఫలమయ్యారు. టీడీపీలో చేరే ముందు.. పార్టీ అధికారంలోకివస్తే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని రాయపాటికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన రాయపాటి విజయం సాధించారు.. నరేంద్రమోడీ మంత్రివర్గంలో టీడీపీ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ వెంటనే చంద్రబాబుతో సమావేశమై టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పట్టుపట్టారు. ఇప్పుడు టీటీడీ పాలక మండలిని రద్దు చేయడంతో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాయపాటి ఓ వైపు.. చదలవాడ మరో వైపు చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2009 నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ చంద్రబాబుకు గాలి ముద్దుకృష్ణమనాయుడు వెన్నుదన్నుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి పోటీచేసిన గాలి ఓటమి పాలయ్యారు. తాను గెలిచి ఉంటే మంత్రివర్గంలో స్థానం దక్కేదని.. ఓడిపోయిన నేపథ్యంలో తనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని చంద్రబాబుపై గాలి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవాలని గాలి కోరుతున్నారు. ఇక చంద్రబాబు సన్నిహితుడుగా ముద్రపడిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్నారు. ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మురళీమోహన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం చంద్రబాబుపై మురళీమోహన్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులకు దక్కుతుందా అన్నది తేలాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు మరి! -
టికెట్ల కోసం తమ్ముళ్ల సిగపట్లు
పార్టీకి పనిచేయని వారికి టికెట్లు ఎలా ఇస్తారు మాజీ మంత్రుల ఎదుట తంబళ్లపల్లె పంచాయతీ మదనపల్లె నాయకుడిపై కార్యకర్తల ఆగ్రహం బి.కొత్తకోట, న్యూస్‌లైన్: పార్టీ టికెట్ల వ్యవహారంపై తంబళ్లపల్లె తెలుగు తమ్ముళ్లు మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయు డు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎదుట శివాలెత్తారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఈ వ్యవహారంలో మదనపల్లెకు చెందిన పార్టీ నాయకుడి పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో విరుకుచుపడ్డారు. ఆదివారం మదనపల్లె రెడ్డీస్‌కాలనీలోని ఓ మిల్లు లో మదనపల్లె టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు కోసం తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు మదనపల్లెకు రావాలని ఆహ్వానం పలికారు. దీంతో బి.కొత్తకోట, తంబళ్లపల్లె, ముల కలచెరువు మండలాలకు చెందిన నాయకులు సొసైటీకాలనీలోని శంకర్ కార్యాలయానికి తరలివచ్చారు. మాజీ మం త్రులు వచ్చారనే విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లారు. ముద్దుకృష్ణమనాయుడు, గోపా లక్రిష్ణారెడ్డి వెలుపలకు వస్తుండగా కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టా రు. పార్టీలో ఒక్కరోజైనా పనిచేయని చల్లపల్లె భాస్కర్‌రెడ్డికి తంబళ్లపల్లె జెడ్పీటీసీ టికెట్‌ను ఎలా ఇస్తారని నిలదీశా రు. పార్టీకి చెందని వ్యక్తులకు ఎంపీటీసీ టికెట్లు ఇస్తున్నారని, ఇంతకాలం పార్టీకి పనిచేసిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇంతలో తంబళ్లపల్లె వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మదనపల్లె నాయకుడిపై విరుచుకుపడ్డారు. సింగిల్‌విండో, సర్పంచ్ ఎన్నికల్లో తమకు ముష్టి ఇచ్చినట్టు చేతులు దులుపుకున్నారని దుమ్మెత్తిపోశారు. దీనిపై తేరుకొని మాజీమంత్రులు సోమవారం గౌనివారి శ్రీనివాసులు తంబళ్లపల్లెకు వచ్చి సమస్యలు తీరుస్తారని అక్కడి నుంచి శంకర్ కార్యాలయానికి వచ్చేశారు. అప్పటికే బి.కొత్తకోట జెడ్పీటీసీ టికెట్ వ్యవహా రంపై నిలదీసేందుకు నాయకులు వేచి ఉండగా టికెట్ విషయంలో సర్వే జరుగుతోందని, ఎవరికి అనుకూలమైన ఫలి తాలోస్తే వారికి టికెట్ ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ పర్వీన్‌తాజ్ కలుగజేసుకున్నారు. దశా బ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారి గతేం టని ప్రశ్నించారు. మీరు జెడ్పీ చైర్మన్ స్థాయి వ్యక్తని చెప్పడంతో అసహనానికి గురైన ఆమె తాను జెడ్పీటీసీ స్థాయి వ్యక్తేనని, పెద్దహోదా అవసరంలేని సమాధానమిచ్చారు. బీసీలు, మైనార్టీల మద్దతు పార్టీకి అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో సమావేశం పూర్తికాకనే మాజీ మంత్రులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ముందే ఖరారు చేసి ముచ్చట్లు బి.కొత్తకోట జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో అభ్యర్థులను ముందే ఖరా రు చేసుకున్న నాయకులు ఆశావహుల తో మొక్కుబడి చర్చలు జరిపారు. మదనపల్లెలోని శంకర్ కార్యాలయంలో తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు జీ.శంకర్ యాదవ్, మదనపల్లె నాయకులు మల్లికార్జుననాయుడులు ఆశావహులతో వేర్వేరుగా చర్చించారు. టికెట్ ఎవరికిచ్చినా పని చేయాలంటూ మొక్కుబడి గా మాట్లాడి పంపారు. దీనిపై టికెట్లు ఆశిస్తున్న నాయకులు అసంతృప్తికి గురయ్యారు. బీ.ఫారాలు దగ్గరే పెట్టుకుని నాటకాలాడుతున్నారని, మమ్మల్ని తి ప్పించుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.