శ్రీకాకుళం, న్యూస్‌లైన్:
జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు 96 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం 96 నామినేషన్లు దాఖలు కాగా అంతకు ముందు దాఖలు చేసిన ఏడు నామినేషన్లతో కలిపి మొత్తం 103కు చేరింది. బుధవారం బీజేపీ నుంచి 3, సీపీఎం నుంచి 3, కాంగ్రెస్ నుంచి 5, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 5, టీడీపీ నుంచి 42, లోక్‌సత్తా నుంచి 1, స్వతంత్రులు 4 నామినేషన్లు దాఖలు చేశారు.
ఎనిమిది మండలాల నుంచి నామినేషన్లు నిల్:
జిల్లాలోని ఎనిమిది మండలాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పలాస, కొత్తూరు, సీతంపేట, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, రాజాం, జి.సిగడాం, సరుబుజ్జిలి మండలాల నుంచి ఒక్క నామినేషన్ కూడా ఇప్పటి వరకూ దాఖలు కాలేదు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే:
జిల్లాలోని 38 మండలాల్లో ఐదు మండలాలనుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇది ఆ పార్టీకున్న అభ్యర్థుల కొరతను తేటతెల్లం చేస్తోంది. ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల అసంతృప్తుల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇటువంటి వారికి చివరి క్షణంలో బీఫారాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే అసంతృప్తులు కాంగ్రెస్ మినహా మరే పార్టీకైనా వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారే తప్ప ఆ పార్టీ పిలిచినా వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
ఎంపీటీసీ స్థానాలకు 1098 నామినేషన్లు
ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి మొత్తం 1098 నామినేషన్లు స్వీకరించారు. శ్రీకాకుళం మండలంలోలో 30 నామినేషన్లు, గారలో 13, ఎచ్చెర్లలో 48, లావేరులో 26, రణస్థలంలో 65, జి.సిగడాంలో 44, నామినేషన్లు దాఖలయ్యాయి.
పాలకొండలో 24 నామినేషన్లు, సీతంపేటలో 21, భామినిలో 33, వీరఘట్టంలో 34, పాతపట్నంలో 19, హిరమండలంలో 17, ఎల్‌ఎన్ పేటలో 22, మెళియాపుట్టిలో 14, కొత్తూరులో 15 నామినేషన్లు దాఖ లయ్యాయి. రాజాంలో 14, రేగిడి లో 18, వంగరలో 19, సంతకవిటిలో 13, పొందూరులో 12, సరుబుజ్జిలిలో 14, ఆమదాలవలసలో 40, బూర్జలో 16 నామినేషన్లు దాఖల య్యాయి. నరసన్నపేట మండలంలో 28, పోలాకిలో 28, సారవకోటలో 25, జలుమూరులో 31 , టెక్కలిలో 34, కోటబొమ్మాళిలో 24, సంతబొమ్మాళిలో 44, నందిగాంలో 36, పలాసలో 23, మందసలో 49, వజ్రపుకొత్తూరులో 40, ఇచ్ఛాపురంలో 21, కంచిలిలో 39, కవిటిలో 50, సోంపేటలో 55 నామినేషన్లు దాఖలయ్యాయి.
జెట్పీటీసీ స్థానాలకు 96 నామినేషన్లు
Published Thu, Mar 20 2014 2:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement