‘దేశా’నికి మైనార్టీలు దూరం | 'Nations' and a distance of Minorities | Sakshi
Sakshi News home page

‘దేశా’నికి మైనార్టీలు దూరం

Published Mon, Apr 7 2014 4:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'Nations' and a distance of Minorities

సాక్షి, సిటీబ్యూరో: బీజేపీతో దోస్తీ కట్టిన చంద్రబాబుపై టీడీపీ మైనార్టీ శ్రేణులు నిప్పులు కక్కుతున్నాయి. పొత్తును నిరసిస్తూ రాజీనామాలు సంధించారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ పక్షాన పోటీ చేసిన జాహెద్ అలీఖాన్ ఆదివారం రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. పార్టీ మైనార్టీ సెల్ మాజీ అధికార ప్రతినిధి అనాస్ సయ్యద్ సలీం సైతం రాజీనామ సమర్పించారు.

ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మైనార్టీ ఓట్లు సుమారు 19.38 లక్షల వరకు ఉన్నాయి. రెండు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement