కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. | Condescending catch the legs .. | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..

Published Sun, Apr 20 2014 2:51 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. - Sakshi

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..

కైకలూరు, న్యూస్‌లైన్ : అయ్యా.. చంద్రబాబు గారు.. నా భర్త 33 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలందించారు.. గతంలో టిక్కెట్టు ఇస్తానని చెప్పి మోసం చేశారు.. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్య భార్య లక్ష్మీపార్వతి. ఈ దంపతులిద్దరూ శనివారం చివరి నిమిషంలో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
 
శుక్రవారం చంద్రబాబును కలిసి కాళ్లావేళ్లాపడి వేడుకున్నా ఏ మాత్రం కనికరించకుండా.. నేనెవరికి చెప్పుకోవాలి అంటూ మాట్లాడారని వాపోయారు. రామానుజయ్య మాట్లాడుతూ గోడు తెలపడానికి వెళ్లిన తన భార్యను, అభిమానులను మహిళ అని చూడకుండా చంద్రబాబు యాత్రలోని పోలీసులు, సెక్యూరిటీ చితకబాదారన్నారు.

ఈ ఘటనలో ఒకరి చేయి విరిగిందన్నారు. అస్పత్రిలో చికిత్ర పొందుతుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ కనీసం ఎలా ఉందని పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులలో భాగంగా బీజేపీకి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళకు గాని, తనకు గాని టిక్కెట్టు కేటాయిస్తే కలసి పనిచేస్తామని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement