ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు | Dammuleka face hooliganism | Sakshi
Sakshi News home page

ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు

Published Mon, Mar 31 2014 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు - Sakshi

ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు

నగరి, న్యూస్‌లైన్: మున్సిపల్ పరిధిలోని 27 వార్డుల్లో అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము లేక తెలుగుదేశానికి బహిరంగంగా వత్తాసు పలుకుతూ మాజీ మంత్రి చెంగారెడ్డి దౌర్జన్యాలు చేయిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఆర్‌కే రోజా అన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 3వ వార్డులో జరిగిన గొడవల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు.

మూడో వార్డులో పోలింగ్ జరుగుతుండగా ఆ వార్డుకు సంబంధంలేని కాంగ్రెస్ నాయకులు చిరంజీవిరెడ్డి, బాబురెడ్డి ఓట్లడగడం గొడవకు కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకపోయినా ఆ ప్రాంతానికి మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె రావడమే ఘర్షణకు దారి తీసిందన్నారు. రచ్చలు పెట్టడమే కాక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆయన ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. చేతకాని కాంగ్రెస్ నాయకులు టీడీపీతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను తుంచేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది వారి తాతమ్మలు, జేజమ్మలు దిగివచ్చినా జరిగే పని కాదన్నారు.

వైఎస్‌ఆర్ సీపీలో ఉన్నవారు రౌడీలని చెంగారెడ్డి చెబుతున్నారని, 35 సంవత్సరాలుగా ఆయన వెనుక పని చేసినపుడు రౌడీలని ఆయనకు తెలియలేదా అన్నారు. ఆయన ప్రవర్తన నచ్చక వచ్చినవారు వైఎస్‌ఆర్ సీపీలో ఉన్నారని, రౌడీలు ఆయన వెంటే ఉన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు వెంట ఉన్నారన్నారు.

3వ వార్డుపై ప్రత్యేకంగా కాంగ్రెస్, టీడీపీ దృష్టి సారించాయని, పలుమార్లు గొడవలకు కూడా లాగారన్నారు. పోలింగ్ రోజున కూడా గొడవలు జరిగే ఆస్కారముందని మూడు రోజులుగా పోలీసులకు చెబుతూనే ఉన్నామన్నారు. చివరకు ఊహించిందే జరిగిందన్నారు. మూడో వార్డు అభ్యర్థి కుమారుడు రామ్‌కుమార్‌కు గాయాలయ్యాయన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement