12న మునిసిపల్, 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు | tension in political leaders about on elections results | Sakshi
Sakshi News home page

12న మునిసిపల్, 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు

Published Sun, May 11 2014 12:44 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

tension in political leaders about on elections results

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మునిసిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ఈనెల 12న కర్నూలు శివారులోని సెయింట్ బాలికల జూనియర్ కళాశాల జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13న కర్నూలు డివిజన్‌లో అన్ని మండలాల ఓట్ల లెక్కింపు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ, డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్)లోను జరుగుతుందని పేర్కొన్నారు. ఆదోని డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్‌కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోందని వివరించారు. వీటికి కూడా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement