పచ్చి మోసగాడు ‘బాబు’ | Raw cheat 'Babu' | Sakshi
Sakshi News home page

పచ్చి మోసగాడు ‘బాబు’

Published Tue, Apr 15 2014 12:29 AM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM

పచ్చి మోసగాడు ‘బాబు’ - Sakshi

పచ్చి మోసగాడు ‘బాబు’

  •     చంద్రబాబు రోడ్‌షోలో పాత చెప్పులతో నిరసనకు నిర్ణయం
  •      ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిన సుబ్బారావు
  •  రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్ : మాదిగలకు మాటిచ్చి మోసం చేసిన తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మంగళవారం మండపేటలో నిర్వహించే రోడ్‌షోలో పాతచెప్పులతో నిరసన తెలియజేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ హెచ్చరించారు.

    సోమవారం ఆయన జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగనై పుడతానని చెప్పుకున్న చంద్రబాబు జిల్లాలో మూరు రిజర్‌‌వ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. మంగళవారం జిల్లాలో పర్యటించే చంద్రబాబుకు ప్రతి మాదిగ ఒక చెప్పుతో నిరసన తెలిపాలని పేర్కొన్నారు.
     
    యనమల వెన్నుపోటు పొడిచాడు
     
    మాదిగలకు సీటు రాకుండా ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజానగరం జడ్‌పీటీసీ స్థానం కేటాయిస్తానని చెప్పి మోసం చేసిన పెందుర్తి వెంకటేష్‌ను ఎన్నికల్లో ఓడించి తీరుతామన్నారు. 2004, 2009 ఎన్నికలలో మాలలకు, మాదిగలకు సమాన రాజకీయ అవకాశం కల్పించింది వైఎస్సార్ ఒక్కరే అన్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకోకపోతే మహాజన సోషలిస్టు పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement