ఎం.ఆర్.అగ్రహారం(తెర్లాం రూరల్), న్యూస్‌లైన్: త్వర లో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కుమ్మక్కై నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయ కర్త ఆర్వీఎస్‌కెకె రంగారావు(బేబీనాయన) అన్నారు. తెర్లాం మండలంలోని ఎంఆర్ అగ్రహారం పంచాయతీ సర్పంచ్ దాలి లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 200 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం రాత్రి చేరారు.
అలాగే ఇదే పంచాయతీ కుమ్మరిపేట గ్రామానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్ ముచ్చి సత్యనారాయణ ఆధ్వర్యంలో బేబీనాయన సమక్షంలో పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బేబీనాయన మాట్లాడుతూ తమ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంద న్నారు. ైవె ఎస్‌ఆర్‌సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసి న పథకాలన్నీ మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్ర మే కొనసాగించగలరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వై ఎస్‌ఆర్ సీపీ అన్నిజిల్లాల్లో అఖండ విజయం సాధించి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను అత్యధికమెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మండల పార్టీ నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, కూనాయవలస సర్పంచ్ బొమ్మి శ్రీనివాసరావు, డి.గదబవలస మాజీ సర్పంచ్ వావిల పల్లి ఆదినారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీలో పలువురి చేరిక
Published Wed, Mar 26 2014 1:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement