
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, తన వైఫల్యాలన్నింటినీ అధికారుల మీద వేసి తాను తప్పించుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలను చట్టానికి అతీతులుగా చూడాలని, వారెలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడినా చూసీ చూడనట్టుండాలని, చంద్రబాబు తొలి కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారని గుర్తుచేశారు.
పరిపాలన గాడి తప్పే దిశలోకి తీసుకు వెళుతున్నారని తమ పార్టీ అప్పుడే హెచ్చరించిందని, ఇప్పుడదే అక్షరాలా నిజమైందని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ... చంద్రబాబు తాను చేసిన తప్పులను ఎవరి మీదకు నెట్టాలన్న తపనే కలెక్టర్ సదస్సులో ఎక్కువగా కనిపించిందన్నారు.