సమైక్య రాష్ట్రమే తమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రమే తమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్య ఉంచేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అంశాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమైక్యాంధ్ర రాష్ట్రం కోరుతూ నేడు అసెంబ్లీ అవరణలోని జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా దీక్ష చేపట్టనున్నారు. కాగా ఆ దీక్షకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులంతా తరలివస్తారని ఎస్.శైలజానాథ్ తెలిపారు.