అనంతపురం: రాయల తెలంగాణ ప్రతిపాదన మంచిది కాదని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. అధిష్టానం విప్ జారీ చేసినా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎంపీఆర్ డ్యాం నుంచి 150 కోట్లతో మంచినీటి పథకానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని శైలజానాథ్ తెలిపారు.