శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:
ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ తమవంతు ప్రయత్నంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా ఆఖరి పోరాటం చేయాలని ఎన్జీవో సంఘ నాయకులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్జీవోలు, సమైక్యవాదులు శ్రీకాకుళంలోని జెడ్పీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని సమైక్యవాదులు కోరగా ఉద్యోగులు విధులు బహిష్కరించి బయటకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశా రు.
కళా బృందాల సభ్యులు సమైక్యాంధ్ర గీతాలు ఆలపించగా.. సమైక్యవాదులు, ఎన్జీవోలు నృత్యాలు చేశారు. అనంతరం జిల్లా కోర్టు వద్ద నాయ్యవాదుల సమైక్య శిబిరాన్ని ఎన్జీవోలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర పరి రక్షణ వేదిక కమిటీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి తగిన మద్దతు లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజనకే మొగ్గుచూపడం బాధాకరమన్నారు. వేదిక ప్రతినిధులు జామి భీమశంకరరావు, దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ విభజన జరిగితే ఇరుప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో సమై క్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు కిలారి నారాయణరావు, శోభారాణి, పూజారి జానకీరాం, బమ్మిడి నర్సింగరావు, ఎల్.జగన్‌మోహనరావు, పి.జయరాం పాల్గొన్నారు.
ఆఖరి పోరాటం చేయండి
Published Sat, Feb 8 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement