CM YS Jagan Attends AP NGOs Rashtra Mahasabhalu In Vijayawada - Sakshi
Sakshi News home page

పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తాం: సీఎం జగన్‌

Published Mon, Aug 21 2023 11:51 AM | Last Updated on Mon, Aug 21 2023 1:36 PM

CM YS Jagan Attends AP NGOs Rashtra Mahasabhalu - Sakshi

Updates

ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం జగన్‌

►పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తాం

►జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారు

►మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు విదిల్చారు

►బాబు, ఆయన వర్గానికి నా మీద కడుపు మంట

►పుంగనూరులో పోలీసులపై దాడి చేశారు

►47 మంది పోలీసులపై దాడికి పాల్పడ్డారు

►ఒక పోలీసు కన్న పోగొట్టారు

►ఉద్యోగుల గురించి బాబుకు ఎంతో దారుణమైన అభిప్రాయాలున్నాయి

►ఉద్యోగుల్లో చంద్రబాబు ఏ వర్గాన్నీ పట్టించుకోలేదు

►బాబు దృష్టిలో కొందరు మంచొళ్లు.. మిగిలిన వారంత లంచ గొండులు

►ఉద్యోగులను ఇలా నిందించే హక్క బాబుకు ఎవరిచ్చారు

►బాబు మంచి చేయగలడా అని ఉద్యోగులు ఆలోచించాలి

►ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడు

►బాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు

►ఉద్యోగులు రిటైరయ్యాక వారి జీవితాల్లో మంచి జరగాలని తీసుకొచ్చాం

►2019 నుండి 3 లక్షల 19 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు

►ఉద్యోగ వ్యవస్థను మెరుగుపరిచేలా అడుగులు వేశాం

►53 వేల మందిని హెల్త్‌ సెక్టార్‌లో నియమించాం

►ఉద్యోగుల ఇబ్బందుల గురించి ఎప్పుడూ సానుకూలంగా స్పందించాం

►ఎంతో నిజాయితీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాం

►దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శగా నిలిచాం

►ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చాం

►జీపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌కు రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్‌ వస్తుంది

►ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపన ఉన్న వ్యక్తిని నేను

►ఈ పెన్షన్‌ స్కీమ్‌ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

►గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసింది

►కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించింది. 

►ఇప్పుడు 7 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్‌, ఒక ఎస్పీని నియమించాం

►గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించాం

►కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ ఇచ్చిన ప్రభుత్వం మనది

►ప్రతీ చోటా దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టాం

►నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచాం

►ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాల మీద మమకారం ఉన్న ప్రభుత్వం మనది

►నాడు-నేడుతో ప్రభుత్వ బడులను కార్పోరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా రూపొందించాం

►కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించాం

►10వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం

►అభివృద్ధి, సంక్షేమంలో మాది ప్రజాప్రభుత్వం

►మాకు, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులు

►మీ సంతోషం, మీ భవిష్యత్తు మన ప్రభుత్వ బాధ్యతే

►ఏ ప్రభుత్వంతో పోల్చినా మేము అంతకంటే మిన్నగా ఉన్నాం

►గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు

►పదవీ విరమణ వయస్తును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం

►ఎప్పుడూ నిజాయితీ కమిట్‌మెంట్‌తోనే అడుగులు వేశాం

►గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టింది

►అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది మనమే

►కోవిడ్‌ టైంలో  రెవెన్యూ తగ్గినా డీబీటీని అమలు చేశాం

►విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలకు హాజరైన సీఎం జగన్‌

►ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌తో పాలు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement