టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరు వల్ల మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆత్మ ఘోషిస్తోందని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు వల్ల ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆత్మ ఘోషిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ - టీడీపీ పార్టీల చీకటి ఒప్పందం వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఆత్మవంచనకు గురవుతున్నారని ఆయన అన్నారు.
తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్కు పెరుగుతున్న ప్రజాదరణ చూసీ ఆ రెండు పార్టీల నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జగన్కు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు.