ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్!
హైదరాబాద్: భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆపార్టీ వ్యవస్తాపకుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని గండిపేటలో జరుగుతున్న మహానాడు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఏక్రగ్రీవంగా తీర్మానం చేసింది.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగుప్రజలంతా కోరుకుంటున్నారని మహానాడులో చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్తానని, ఒత్తిడి తీసుకువస్తానని చంద్రబాబు తెలిపారు. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా కృషి చేస్తానన్నారు.
కేంద్రంలో పౌర విమానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నారని.. ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా ప్రయత్నిస్తానని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.