
అధికారిక జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదు
ఎల్ అండ్ టీ చైర్మన్‌కు ‘పద్మ విభూషణ్’ సిఫార్సు
న్యూఢిల్లీ: పద్మ అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎస్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ స్కూృటినీ చేసి పంపిన జాబితాలో దివంగత ఎన్.టి. రామారావు పేరు లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అసలు భారత రత్న కోసం ఎవరి పేరూ సిఫార్సు చేయలేదని వెల్లడించాయి. పద్మ అవార్డుల కోసం ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాలో ప్రతిపాదిత పేర్లివీ..
► పద్మ విభూషణ్: ఎ.ఎం. నాయక్ (ఎల్ అండ్ టీ చైర్మన్), నోరి దత్తాత్రేయుడు (డాక్టర్), బాపు (ప్రముఖ చిత్రకారుడు, ప్రముఖ దర్శకుడు), నాగేశ్వరరెడ్డి (డాక్టర్), రాజిరెడ్డి (ఐటీ)
► పద్మ భూషణ్: చాగంటి కోటేశ్వరరావు (సంస్కృత పండితుడు), నేదునూరి కృష్ణమూర్తి (సంగీతం), మురళీమోహన్ (సినీ రంగం).
► పద్మ శ్రీ: మోహన్ కందా (రిటైర్డ్ ఐఏఎస్), సత్యవాణి (సాంఘిక సేవా రంగం), ఎ.కన్యాకుమారి (వయోలిన్ విద్వాంసురాలు), కోట శ్రీనివాసరావు (సినీనటుడు), గల్లా రామ చంద్రనాయుడు (వాణిజ్యం), పసుమర్తి శర్మ(కూచిపూడి), శ్రీధర్ (కార్టూనిస్ట్), ఐ.వెంకట్రావు (పాత్రికేయుడు)