Balayya : బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..? | Balakrishna Failed In Chandrababu Political Game, Know Main Incidents Which CBN Made Him Fool - Sakshi
Sakshi News home page

Chandrababu Political Game: బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..?

Published Sat, Sep 23 2023 8:57 AM | Last Updated on Sat, Dec 23 2023 9:35 AM

Balakrishna Failed In Chandrababu Political Game - Sakshi

పేరేమో నందమూరి బాలకృష్ణ.. మా బ్లడ్‌ వేరు, మా బ్రీడు వేరు అంటూ కామెంట్లు చేస్తూ అందరికంటే తాను మాత్రమే గొప్ప అనుకుంటూ భ్రమలో బతికేస్తుంటాడు బాలయ్య.  సినిమాల్లో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులతో అమర్యాదగా వ్యవహిరించినట్లుగా మొన్న యువగళం విజయోత్సవ సభలో ఆయన తీరు కనిపించింది. చంద్రబాబు తన బావమరిది అయిన బాలకృష్ణకు మైక్ ఇచ్చాడు. ఇంకేముంది దొరికిందే సందు అన్నట్టు ఆయన నోటికి పని చెప్పాడు. పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో యువగళం సభలో మరోసారి బాలయ్య చేష్టలతో రుజువు చేశాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

వాస్తవానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని వైద్యులు ఎప్పుడో ధ్రువీకరించారు. ఆ సర్టిఫికెట్‌ కూడా ఆయన వద్ద ఇప్పటికీ భద్రంగా తన బీరువాలో ఉంది. అందుకే ఆయన జోలికి ఎవరూ పోరు.. ఎందుకంటే గన్‌ తీసుకుని ఎవరిని, ఎక్కడ కాల్చిపడేస్తాడో అనే భయం. అంతే కాకుండా ఆయనకు చికిత్స అవసరమని కూడా మెడికల్‌ సర్టిఫికేట్‌లో వైద్యులు కూడా ధ్రువీకరించారు. కానీ తన బావ చంద్రబాబు రాజకీయ అండతో ప్రజల్లో తిరుగుతున్నాడు. కాలక్రమేనా రాజకీయ నాయకుడిగా మారిన ఈ నటుడు అభిమానులను శారీరకంగా లేదా అసభ్య పదజాలంతో కొట్టడం సరిపాటిగా జరుగుతున్నది.

బాలయ్య మానసిక స్థితి గురించి అభిమానులకు కూడా తెలుసు కాబట్టి వారు కూడా సర్ధుకుపోతున్నారు. బాలయ్య కొట్టినా.. ఇష్టానుసారంగా కామెంట్లు చేసినా ఎగిరి గంతులేస్తూ ఆనందపడుతారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో బాలయ్య చేష్టలు చూసిన వారంత అర్జెంట్‌గా ఆయన ఇంకా పరిణితి చెందాలంటున్నారు. గతంలో ఆయన ఖాతాలో ఇలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయి.

మహిళలపై గతంలో అసభ్యకర వ్యాఖ్యలు 
గతంలో నారా రోహిత్‌ సినిమా వేడుకలో మహిళల పట్ల బాలయ్య నోటి నుంచి జారిన అణిముత్యాలు ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పుకోరు కదా! ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. హీరో నారా రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు.. పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు.’ అని సభ్యసమాజమే సిగ్గుపడే వ్యాఖ్యలు చేశాడు

‘నాదో లోకం.నేను ఎలా వ్యవహరించినా..ఏం మాట్లాడినా తప్పులేదు’ అన్నట్టుగా ఆయన ఇప్పటికీ అలానే  ప్రవర్తిస్తున్నాడు. మహిళలు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై గొప్పగొప్ప మాటలు చెప్పే బాలయ్య అసలు స్వరూపం ఇదే అని ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎప్పుడో గ్రహించారు. అందుకే ఆయనకు దగ్గరగా వెళ్లేందుకు ఏ టీడీపీ నాయకుడు కూడా సాహసం చేయడు.

బాధ్యాతాయుత ప్రవర్తన కాదది.!
చంద్రబాబు బావ జైలుకు వెళ్లాడని ఏపీ అసెంబ్లీలో మీసం మెలేసి తొడ కొడుతున్న బాలయ్యపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. కన్న తండ్రి మీద నాడు చంద్రబాబు చెప్పులేయిస్తుంటే వైస్రాయ్‌ హోటల్‌లో కూర్చొని 'అరె బావా   ఏక్ పెగ్  లా' అంటూ  మ్యాన్షన్ హౌస్ తీసుకుని చిందులేసి నిద్రపోలేకపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పుడెందుకు తొడ కొట్టలేదు.? ఇదే పౌరుషం అప్పుడెందుకు చూపించలేదంటున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్‌లో "ఎవడ్రా మా నాన్న గారి జోలికి వచ్చేదని ఎందుకు అడ్డంగా నిలబడలేదు..?" అని ఉంటే వ్యక్తిత్వంలో ఎంతో మిన్నగా ఉండిపోయేవారంటున్నారు.

తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలయ్య
జీవిత చ‌ర‌మాంకంలో తండ్రిని ఘోరంగా అవ‌మానించి, మాన‌సికంగా వేధించి ఆయ‌న చావుకు ఎన్టీఆర్ వార‌సులు త‌లా ఒక చేయి వేశార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఎన్టీఆర్‌కు ప‌ది మంది పిల్ల‌లున్న‌ప్ప‌టికీ ఏ ఒక్కరూ తండ్రి ఆవేద‌న‌లో పాలు పంచుకోలేదు. పైగా ఆయ‌న క‌న్నీళ్ల‌కు కార‌కులై, తండ్రికి శాశ్వ‌తంగా రుణ‌ప‌డ్దార‌నే చెడ్డ‌పేరును తెచ్చుకున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు ఆ రోజు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడ‌వ‌డాన్ని స‌మ‌ర్థిస్తూ... అన్‌స్టాప‌బుల్‌ ఎపిసోడ్‌లో సమర్థించుకోవడం త‌న‌యుడిగా నంద‌మూరి బాల‌కృష్ణకు నిజంగా సిగ్గుచేటే.

తండ్రి కష్టాల్లో ఉంటే కొడుకు ఒక మూల స్థంబంలా నిలబడుతాడు. కానీ బాలయ్యకు ఆ ఆలోచన ఏమాత్రం లేదు. 'ఎన్టీఆర్ క‌డుపున పుట్ట‌డం మీ అదృష్టం, ఆ పెద్దాయ‌న దుర‌దృష్టం' అని నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఇలాంటి పిల్ల‌ల వ‌ల్లే చంద్ర‌బాబు ఆట‌లు ఇన్నేళ్లపాటు నందమూరి కుటుంబంలో సాగాయ‌ని, మ‌రే నాయ‌కుడికి ఎన్టీఆర్‌కు ప‌ట్టిన దుస్థితి రాకూడద‌ని నెటిజ‌న్లు పోస్టులు పెట్ట‌డం గ‌మ‌నార్హం. 

ఈ పని చేసి చెప్పు నీ బ్లడ్‌, బ్రీడు గురించి
ఏనాడు అసెంబ్లీకి సాధారణంగా రాని బాలయ్య చంద్రం బావ కళ్లలో ఆనందం చూడటానికి మీసాలు తిప్పుతూ తొడలు కొడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. కన్నతండ్రి కంటే.. బావ ఎక్కువయ్యాడా బాలయ్యా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ లేకపోతే బాలయ్య ఎక్కడా..? బాలయ్య అడ్రస్ ఏంటీ..? ఎన్టీఆర్‌ లేకపోతే చంద్రబాబు ఎవడు..? చంద్రబాబు అడ్రస్ ఏంటీ..? జీవితం, రాజకీయ జీవితం ఇచ్చిన  ఎన్టీఆర్‌ మీద చెప్పులేసినప్పుడు నీ పౌరుషాన్ని ఎక్కడ పెట్టుకున్నావు బాలయ్యా..? నీవు నిజమైన ఎన్టీఆర్‌ బిడ్డవైతే.. టీడీపీని ఇప్పటికైనా చేతిలోకి తీసుకో.. ఎన్టీఆర్‌ అభిమానులు తొడ గొట్టి, మీసాలు తిప్పేలా చేయ్.. అదీ ఒక వారసుడి లక్షణం.. అప్పుడు చెప్పు నీ బ్లడ్‌, బ్రీడు గురించి అని అన్నగారి అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.
 

రాజకీయ వారసుడిగా మారిన చంద్రబాబు
నందమూరి వంశాన్నే కూలదోయాలని రాజకీయ చదరంగం ఆడటం చంద్రబాబు ఎప్పుడో మొదలు పెట్టాడు. అప్పటికే   అన్నగారి బిడ్డ అయిన భువనేశ్వరిని పెళ్లి చేసుకుని నందమూరి ఇంట్లోనే రాజకీయ కాపురం చంద్రబాబు పెట్టాడు. అలా ఎన్టీఆర్‌కు అంతగా రాజకీయం గురించి తెలియదని పసిగట్టేశాడు. ఎంతైనా చంద్రబాబుది కాంగ్రెస్ బుర్ర కదా..!  చాప కింద నీరులా తన వర్గాన్ని పెంచుకుంటూ వచ్చాడు.. రామోజీ లాంటి మీడియా అధిపతితో 1995 వరకు రహస్య స్నేహం చేసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దించారు. నిజానికి ఎన్టీఆర్‌కు కూడా రాజకీయం అంతగా తెలియదు. తెలిసుంటే బాబు చేతికి చిక్కేవారు కాదు.

1980ల్లో కాంగ్రెస్‌ మీద ఉన్న వ్యతిరేకత ఎన్టీఆర్‌కు కలిసి వచ్చి సీఎం అయ్యారు. 1994లో కూడా కాంగ్రెస్‌ మీద ఉన్న వ్యతిరేకతనే ఆయన మళ్లీ గెలిపించింది. కొన్నిరోజుల తర్వాత ఏపీ రాజకీయాల్లో నందమూరి పోయి నారా బ్రాండ్‌ వచ్చింది. ఎప్పటికైనా తనకు నందమూరి వారసులు నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని తెలివిగా గ్రహించిన చంద్రబాబు మరో ప్లాన్‌ వేశాడు. తన కుమారుడు అయిన లోకేశ్‌కు బ్రాహ్మణిని జతకలిపాడు. ఇలా తన రాజకీయ చదరంగంలో బుర్రలేని బాలయ్యతో పాటు నందమూరి వారసులందరూ బలిపశువులు అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement