ప్రతి ఒక్క స్టార్ హీరోకి కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే కొంత మందికి మాత్రమే వాటిని నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. మరికొంత మందికి అవి డ్రీమ్‌గానే మిగిలిపోతాయి. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఆయన ఏ పాత్ర చేయాలనుకున్నా..అది చేసేస్తున్నాడు. సినిమా ఏదైనా తన పాత్రను నెక్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు. ఇక పురాణాల పాత్రలను అవలీలగా చేసేస్తున్నాడు.
(చదవండి: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కల్కి.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?)
వెండితెరపై మనకు రాముడైనా..కృష్ణుడైనా ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆరే. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్‌ను మించి ఎవరూ చేయలేరు అంటారు. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను బాలకృష్ణ పోషించి మెప్పించాడు. ఈ తరంలో మాత్రం ఆ అవకాశాన్ని ప్రభాస్ అందిపుచ్చుకున్నాడు. పురాణ పాత్రలను అవలీలగా పోషిస్తున్నాడు. ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
(చదవండి: 'కల్కి'లో కృష్ణుడి ముఖం అందుకే చూపించలేదా?)
ఇప్పుడు ‘కల్కి 2898’లోనూ పౌరాణిక పాత్రలో కనిపించి మెప్పించాడు. సినిమా మొత్తం సాధారణ వ్యక్తి భైరవగా కనిపించినా ప్రభాస్.. చివరల్లో మాత్రం మహాభారతంలోని ఓ కీలక పాత్రలో కనిపించి అందరికి షాకిచ్చాడు. పార్ట్ 2లో ఆ పాత్రతో పాటు మరో పౌరాణిక పాత్రలోనూ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ పౌరాణిక పాత్రే పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా నేటితరం హీరోల్లో పౌరాణిక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment