Minister RK Roja Counter Attack On Super Star Rajinikanth Over His Comments On SR NTR - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారు: మంత్రి రోజా

Published Sat, Apr 29 2023 10:35 AM | Last Updated on Sat, Apr 29 2023 12:21 PM

Minister RK Roja Counter Attack On Super Star Rajinikanth - Sakshi

సాక్షి, విజయవాడ: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు చేశారు. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. 

కాగా, మంత్రి రోజా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారు. ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుంది. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్సాఆర్‌. ఇందుకు కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్‌ తెలుసుకోవాలి. 

ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదు. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. రజనీకాంత్‌పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారు. ఇంతలా మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?. రజనీకాంత్‌ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదు. రజనీకి ఎన్టీఆర్‌ను అసెంబ్లీలో ఎలా అవమానించారో రికార్డులు పంపిస్తాను’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: స్కిల్‌ స్కాంలో ఈడీ దూకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement