సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో పోలవరంపై ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పోలవరంపై చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదన్నారు. పోలవరంపై చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా, మంత్రి అంబటి శనివారం విజయవాడలో పోలవరంపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమే. టీడీపీ హయాంలో తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యమైంది. చంద్రబాబు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చంద్రబాబు హయాంలో అన్నీ కరువుకాటకాలే. చంద్రబాబు శనిపాదం అడుగుపెడివతే వర్షాలే కురవవు. ఎల్లోమీడియాతో పోలవరంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబే.
బాబు.. నీకు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పు..
చంద్రబాబు చిత్తశుద్ధి ప్యాకేజీపైనే తప్పు ప్రాజెక్ట్‌పైన లేదు. రాష్ట్రానికి, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ను.. నువ్వెందుకు తీసుకున్నావ్?. 2013-14 రేట్లకు ఒప్పుకుని పోలవరాన్ని 2016లో రేట్లకు నవయుగకు ఇచ్చాడు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారు. టీడీపీ హయాంలో కమీషన్ల కోసమే తాపత్రయపడ్డారు. చంద్రబాబు నైజం గురించి ప్రధానికి బాగా తెలుసు. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు. బాబు.. నీకు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పు. చంద్రబాబు అధికార దాహంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును నేను తిట్టలేనా?.. కానీ నాకు సంస్కారం ఉంది.
నాది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందం
ఇక, ఇదే సమయంలో బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానే అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘పవన్ సినిమాలో నా క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నా. పవన్‌ది శునకానందం. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి నేను వేసింది ఆనందతాండవం. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందం. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయను. నా డ్యాన్స్ సింక్ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్ మాస్టర్‌నా?. అసలు రాజకీయాలకు పవన్ సింక్ అవ్వడు అంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment