AP MLA Kodali Nani Fire On Super Star Rajinikanth, Details Inside - Sakshi
Sakshi News home page

Kodali Nani: ‘పవన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు రజినీకాంత్‌ రంగంలోకి!’

Published Sat, Apr 29 2023 1:44 PM | Last Updated on Sat, Apr 29 2023 3:06 PM

AP MLA Kodali Nani Fire On Super Star Rajinikanth - Sakshi

సాక్షి,  కృష్ణా:  ఆంధ్రప్రదేశ్‌లో జీరో అయిన రజినీకాంత్.. సిగ్గూ శరం లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్‌పై ఆనాడు చెప్పులు విసురుతుండగా.. చంద్రబాబుకు రజినీకాంత్‌ మద్దతు తెలిపారని గుర్తు చేశారాయన. అలాంటి రజినీ ఇవాళ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. 

‘‘వెధవలంతా ఒకచోట చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను చేస్తున్నారు. ప్రజలెవరూ వాళ్లను పట్టించుకోరు. ఎన్టీఆర్ బ్రతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు?. అసలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు?. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను  రజినీ చదువుతూ.. మరింత దిగజారిపోతున్నాడు’’ అని కొడాలి మండిపడ్డారు. 

పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజినీని చంద్రబాబు రంగంలోకి దించాడని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని పవన్‌ ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు.

ఇదీ చదవండి: రజినీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement