Ex-Minister Kodali Nani Slams TDP Chandrababu And Nara Lokesh Babu - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ వారసులు సామాన్యుల్లా బ్రతుకుతున్నారు: కొడాలి నాని

Published Fri, Feb 17 2023 2:38 PM | Last Updated on Fri, Feb 17 2023 3:25 PM

Kodali Nani Slams TDP Chandrababu And Nara Lokesh Babu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. లోకేష్‌ యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా?. సీఎం వైఎస్‌ జగన్‌ డీఎన్‌ఏ రాయలసీమది.. లోకేష్‌ డీఎన్‌ఏ తెలంగాణది. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడు. ఒక ఎజెండా లేకుండా లోకేష్‌ యాత్ర చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు. నేను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడే మాటలు వినిపించడం లేదా?. 

చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం జగన్‌ పండగ చేశారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాలు ఎలా సంపాదించావు?. ఎన్టీఆర్‌ వారసులు అందరూ సామాన్యుల్లా బ్రతుకుతున్నారు. ఎన్టీఆర్‌ ఆస్తి అంతా నీకు పంచి ఇచ్చారా?. రైతులను మోసం చేసి, పేదలను సర్వనాశనం చేసిన 420 చంద్రబాబు. ఓ అవినీతి చక్రవర్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు అంటూ సంచలన విమర్శలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement