
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబు లేదంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు షోలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. తనను వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని సీనియర్ ఎన్టీఆరే చెప్పారు. స్వయానా ఎన్టీఆర్.. చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ చెప్పారు. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబు లేదు. చంద్రబాబు నిర్వహిస్తున్న మీటింగ్‌లకు జనం రావడం లేదు. చంద్రబాబువన్నీ అట్టర్ ఫ్లాప్ షోలే అంటూ విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు
Comments
Please login to add a commentAdd a comment