
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సంచలన విమర్శలు సైతం గుప్పించారు.
కాగా, మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ అసమర్థుడు, అమాయకుడు. కుట్రలు, కుతంత్రాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు. వెన్నుపోటు రక్తపుమరకను తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాక్‌షోతో చంద్రబాబు మరింత దిగజారిపోయారు. టీడీపీ నేత నారా లోకేశ్ హాస్యనటుడులాంటి వ్యక్తి. చంద్రబాబు తన స్వార్థంకోసమే టాక్‌షోకు హాజరయ్యారు. వినకపోతే జుట్టుపట్టుకుని లాగామని చంద్రబాబు అంటే.. అది న్యాయమే, ధర్మమే అని బాలకృష్ణ అంటున్నారు. ఎన్టీఆర్ మరణం కరెక్ట్ అని మీరంటుంటే జనం నమ్మాలా?. లోకకల్యాణం కోసమే ఎన్టీఆర్‌ను దించేశారా?. చంద్రబాబు.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. ఒకవేళ ఎన్టీఆర్.. మరణించకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు సంధించారు.
ఈ క్రమంలోనే అమరావతి పాదయాత్ర గురించి స్పందిస్తూ.. చంద్రబాబు ఫేక్ యాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమయ్యారు, పోరాటపటిమను పెంచుకుంటున్నారు. టీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment