సాక్షి, అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబు పూర్తిస్థాయి డ్రామాతో రక్తి కట్టించారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ మేరకు శాసనసభ సమావేశం అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పూర్తి స్థాయి నటుడు. ఆయన ఏడ్వటం దొంగనాటకం. చంద్రబాబు గ్లిజరిన్ సరిగా వేసుకున్నట్లు లేదు. కనీసం కన్నీళ్లు కూడా రావడం లేదు. సానుభూతి కోసం బాబు తన కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకీడుస్తారు. చివరకు భార్యను సైతం రాజకీయాల కోసం వాడుకున్నారు. చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు. సీఎం పదవి కోసం చంద్రబాబు భార్యను కూడా రోడ్డు మీదకు తెచ్చారు.
చదవండి: (విధి ఎవర్నీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది: ఆర్కే రోజా)
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. అసెంబ్లీ హాల్‌లో కానీ, బయటకానీ ఏడ్వని చంద్రబాబు మీడియా ముందుకు రాగానే ఏడ్వడం మొదలెట్టారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి డ్రామా రక్తికట్టించారు. అసెంబ్లీలో ఏ ఒక్కరూ చంద్రబాబు కుటుంబ సభ్యులను గాని, ఆయన భార్యను గురించి కానీ మాట్లాడలేదు. ఇప్పటిదాకా బాబు కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు అంటున్నాడు కానీ ఎవరు మాట్లాడారో మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. నా భార్యను అన్నారు అంటూ భార్యను కూడా రాజకీయం కోసం వాడుకునేస్థాయికి దిగజారిపోయిన వ్యక్తి చంద్రబాబు. బాబు డ్రామాల్ని, న్యూసెన్స్‌ని ప్రజలెవరూ పట్టించుకోరు.
చదవండి: (బాబు నిన్న చర్చించాడు.. నేడు అమలు చేశాడు: కొడాలి నాని)
రామారావు గతంలోనే చంద్రబాబు నన్ను మించిన ఆర్టిస్ట్ అనేవారు. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని దొంగలించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కు ఆత్మాభిమానం ఉంది కాబట్టి అంత జరిగినా మీడియా ముందుకు వచ్చి ఏడ్వలేదు. నాపార్టీని, నా పదవిని.. చివరకు నా కుటుంబాన్ని కూడా నాకు దూరం చేశాడని ఎన్టీఆర్ ఆ రోజు ఎంతగానో కుమిలిపోయాడు తప్ప బాబులా డ్రామాలు రక్తికట్టించలేదు. ఎన్టీఆర్ విషయంలో చేసిన పాపాలు, ప్రజల్ని నమ్మించి మోసం చేసిన పాపాలు బాబును అంత త్వరగా వదిలిపెట్టవు. ఈ మధ్యజరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కుప్పంలో కానీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు కాబట్టి రాజకీయ మనుగడ కోసమే ఈ డ్రామాలన్నీ. రాజకీయ అవసరాల కోసం భార్యను ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని మంత్రి కొడాలి నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment