యుగ పురుషుడు ఎన్టీఆర్: కొడాలి నాని | Kodali Nani Slams Chandrababu Naidu On NTR Death Anniversary | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు బతికుండగా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదు’

Published Mon, Jan 18 2021 6:35 PM | Last Updated on Mon, Jan 18 2021 8:56 PM

Kodali Nani Slams Chandrababu Naidu On NTR Death Anniversary - Sakshi

సాక్షి, తాడేపల్లి : సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి చేరుకున్న మహా వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని కొనియాడారు. మహానుభావుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అయిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామను పార్టీ నుంచి మెడపట్టి గెంటేశాడని మండిపడ్డారు. పార్టీని తస్కరించిన దొంగ.. ఎన్టీఆర్‌ వర్ధంతి నాడు ఆయనకు దండ వేయడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఎన్టీఆర్‌ ఎలా చనిపోయాడో, దానికి కారణమైన వారెవరో అందరికీ తెలుసన్నారు. ముఖాన ఉమ్మి వేస్తారనే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఇంకా పాతికేళ్లు ఉన్నా ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని బాబు డిమాండ్ చేస్తూనే ఉంటాడు కానీ ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని చంద్రబాబు బతికుండగా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదని పేర్కొన్నారు. 

చంద్రబాబుకు ప్రపంచ రత్న ఇవ్వాలి
‘ఎన్టీఆర్ తెర మీద నటుడైతే... చంద్రబాబు నిజ జీవితంలో నటుడు. చంద్రబాబుకు వెన్నుపోటులో ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. రామారావు బొబ్బిలిపులి అయితే నువ్వు పిల్లివి. ఎన్టీఆర్ ఆస్తులు ధ్వంసం చేసావంటున్న కాంగ్రెస్‌తో ఎందుకు జత కట్టావు. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మాత్రమే టీడీపీని నాశనం చేయగలరు .వాళ్ళు చంద్రబాబు, పప్పు నాయుడు . పాపం ఆడపిల్ల అఖిల ప్రియ గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఇదే ఏపీలో ఆమెను అరెస్ట్ చేస్తే గోల గోల చేసేవాడు. ఎన్టీఆర్‌ గొప్పతనం గురించి ఏ పార్టీలోనూ రెండో ఒపీనియన్ లేదు. మా పార్టీలో కూడా లేదు. ఎన్టీఆర్ ఆశీస్సులు మాకు, మా జగన్‌మోహన్‌రెడ్డికే ఉంటాయి. ఒక మారుమూల దేవాలయాలను ధ్వంసం చేస్తారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఉదయాన్నే దిగిపోతారు. సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీ క్రిస్టియన్ అంటూ ఆరోపణలు చేస్తారు. డీజీపీ స్పష్టంగా 9 కేసుల్లో టీడీపీ వారు ఉన్నట్లు తేలింది. మా పేర్లు చెప్పడానికి వీలేదంటూ ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

అప్పట్లో సీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో టీడీపీ వారిని అరెస్టు చేశారు. ఈ రోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీని భయపెట్టాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర డీజీపీకి, పోలీసు వ్యవస్థను మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు ఎవర్నీ వదలాల్సిన అవసరం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే చంద్రబాబులాంటి వ్యక్తినైనా లాక్కొచ్చి లోపలేయవచ్చు. మా నాయకుడు పక్కా మానవత్వవాది. ఎక్కడికి వెళ్లిన అక్కడి విశ్వాసాలను అవగాహన చేసుకుని పూజిస్తాడు. పక్కా రాజకీయ వ్యభిచారి చంద్రబాబు. నువ్వు చేసే ఆరోపణలు దేనికీ పనికిరావు. ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వెన్నుపోటు పొడిచే నీచుడిని బంగాళాఖాతంలో కలపాలి.  ఎన్టీఆర్‌ బొమ్మను తాకే అర్హత కూడా చంద్రబాబుకి లేదు. రాష్ట్రంలో 70 వేల దేవాలయాలు ఉన్నాయి. అన్ని చోట్లా సీసీ కెమెరాలు లేవు. అలా లేని చోట్లను ఎంచుకుని చంద్రబాబు దాడులు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ అభిమానులు చంద్రబాబును వెంబడించి రాష్ట్రం నుంచి తరిమేయాలి.’ చంద్రబాబుపై అని కొడాలి నాని ధ్వజమెత్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement