తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు! | master ntr dana veera sura karna | Sakshi
Sakshi News home page

తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు!

Published Sun, Apr 26 2015 11:01 PM | Last Updated on Sun, Jul 14 2019 3:48 PM

తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు! - Sakshi

తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు!

నటవిఖ్యాత నందమూరి తారక రామారావు నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అదే పేరుతో ఓ బాలల చిత్రం రానుంది. ఇందులో నందమూరి జానకిరామ్ తనయులు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, మరో కుమారుడు సౌమిత్రి సహదేవునిగా నటించారు. శ్రీ సాయి జగపతి పిక్చర్స్ సంతోష్ ప్రొడక్షన్స్ పతాకంపై చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జేవీఆర్ దర్శకుడు.
 
  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మేము అనుకున్న దానికన్నా బాల నటీనటులు బాగా నటించారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రి తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు’’ అని చె ప్పారు. ‘‘నాటి ‘దానవీరశూరకర్ణ ’కు పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి కూడా పనిచేయడం విశేషం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని జె.బాలరాజు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, కళాదర్శకులు: ఎస్.ఆర్.కె.శర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement