సాధారణంగా మన సినిమా తారలు కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. అందులోనూ స్టార్ హీరోలు ఈ వరుసలో ముందుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కార్లపై ఇంట్రస్ట్ అందరికంటే ఎక్కువగా ఉన్న హీరో చిరంజీవి. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వాళ్ళ కంపౌండ్‌లోకి తెచ్చుకుంటారు మన మెగాస్టార్. ఇక ఈ జనరేషన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ లిస్ట్‌లో ఒకరు. ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్‌లో పదికి పైగా కార్లు ఉండగా.. ఇటీవల అత్యంత విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఆ కారును మొన్నటికి మొన్న రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే తారక్ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అదేంటి అన్ని కార్లకి ఒకే నంబర్ అనుకుంటున్నారా? దీనికి సమాధానంగా తన సన్నిహితులు కొందరు తారక్‌కి ఆ నంబర్ అంటే సెంటిమెంట్ అని అంటుంటారు. కానీ నిజానికి ఎన్టీఆర్‌కు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవట.
మరెందుకు ఒకే నంబర్‌ను తన అన్ని కార్లకు వాడుతున్నాడనేగా మీ సందేహం..? దానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్‌కు 9 అనే అంకె అంటే ఇష్టమట. అలాగే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కారు నెంబర్ 9999 అనీ.. ఆ తర్వాత తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నంబర్‌ను వాడారని అందుకే తనకు ఆ నంబర్ అంటే ఇష్టమని ఇటీవల ఓ సందర‍్బంలో ఎన్టీఆర్ చెప్పాడు. అందువల్ల మరో ఆలోచన లేకుండా తన ప్రతి కారుకు అదే నంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు తారక్.
తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాని అది సెంటిమెంట్ కాదని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన తన తాత నందమూరి తారక రామారావు, తన తండ్రి హరికృష్ట ఇద్దరూ ఆ నెంబర్ వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. ఇక తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్‌కు 9 సెంటిమెంట్ నిజమేనా?
Published Mon, Sep 6 2021 12:15 AM | Last Updated on Mon, Sep 6 2021 10:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment