RRR Movie: Jr NTR Fan Buys 75 Tickets in Texas - Sakshi
Sakshi News home page

RRR Movie: అమెరికాలో ఎన్టీఆర్‌ వీరాభిమాని ఏం చేశాడో తెలుసా?

Published Sat, Mar 5 2022 6:18 PM | Last Updated on Sat, Mar 5 2022 10:20 PM

RRR Movie: Jr Ntr Fan Buys 75 Tickets In Texas - Sakshi

టాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ మూవీస్‌ ఇప్పుడు థియేరట్స్‌లో సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో భాగంగా మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాలు రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల కోసం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల అవుతుండగా, మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ కానుంది. ఒకే నెలలో రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే ఎన్టీఆర్‌ వీరాభిమాని ఒకరు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఊహించినట్లుగానే గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా అమెరికా డల్లాస్‌ నగరంలోని  గెలాక్సీ థియేట‌ర్లోఎన్టీఆర్‌ అభిమాని ఒకరు ఏకంగా 75టికెట్లను కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు.

దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన‌మెంట్స్ ప‌తాకం పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement