Jr NTR Tweet On Sr Nandamuri Taraka Rama Rao On His 100th Birth Anniversary - Sakshi
Sakshi News home page

Jr NTR: ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా: జూనియర్‌ ఎన్టీఆర్‌

Published Sun, May 28 2023 1:27 PM | Last Updated on Sun, May 28 2023 1:52 PM

Jr NTR Tweet on Nandamuri Taraka Rama Rao on His Birth Anniversary - Sakshi

హీరోలు పాత్రల్లో నటిస్తారు. కానీ కొందరు నటిస్తే ఆ పాత్రలే పరిపూర్ణమవుతాయి. ఆయా పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాంటి దిగ్గజ దివంగత నటుడే నందమూరి తారక రామారావు. 'మన దేశం'తో మొదలైన ఆయన ప్రయాణం 'మేజర్‌ చంద్రకాంత్‌' వరకు సాగింది. ఈ ప్రయాణంలో దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌ చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు, పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. నేడు(మే 28) ఆయన శతజయంతి .

ఈ సందర్భంగా తాతను తలుచుకుంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ చివర్లో తన సంతకాన్ని జత చేశాడు. మా గుండెలను మరొక్కసారి తాకిపోండి తాతా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని తన ట్వీట్‌లో యాడ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ఆరు పడవల ప్రయాణం.. దటీజ్‌ ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement