మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా రాణించారాయన. గతంలో ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. మరి ఆయన ఏమని మాట్లాడారో ఓసారి చూద్దాం.. 'పౌరాణికం, జానపదం, సాంఘికం, హారర్, విప్లవం.. ఇలా అన్నిరకాల సినిమాలు చేశాను. అందుకు సంతృప్తిగా ఉంది. అల్లూరి సీతారామరాజు, ఈనాడు వంటి సినిమాల్లో పోషించిన పాత్రలు నాకెంతో ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తి.
నిజానికి నేను నందమూరి తారకరామారావు అభిమానిని. కానీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడూ నేరుగా చూడలేదు. అయితే నాగేశ్వరరావును మాత్రం నాలుగుసార్లు చూశాను. అప్పుడు సినిమా ఆర్టిస్టులకున్న క్రేజ్ చూసి నేనూ ఆర్టిస్ట్ అవుదామనుకున్నా! అలా మొదటిసారి తేనె మనసులు చిత్రంలో నటించా. ఏడు సంవత్సరాలలోనే వంద సినిమాలు చేశాను' అని చెప్పుకొచ్చారు కృష్ణ.
చదవండి: కృష్ణ చివరి చిత్రం ఏంటో తెలుసా?
ఆయన లేరన్న వార్త విని గుండె పగలింది: రామ్‌చరణ్
Comments
Please login to add a commentAdd a comment