
‘వేతన బకాయిలను తీసుకోండి’
హైదరాబాద్: ఓయూలో పని చేసి 1996 నుంచి 2013 వరకు ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు వేతన బకాయిలను తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ.సురేశ్ కుమార్ కోరారు. సీనియర్ సినీనటి జమున భర్త దివంగత ప్రొ.జూలూరి రమణరావుకు రావాల్సిన వేతన బకాయి రూ. 11.87 లక్షల చెక్‌ను రిజిస్ట్రార్ మంగళవారం తన కార్యాలయంలో జమునకు అందజేశారు. ఆమెతో పాటు ప్రొ.బిలిలోలికర్‌సింగ్ రూ.12 లక్షల చెక్‌ను అందుకున్నారు.