సాక్షి, బంజారాహిల్స్: తెలుగు సినిమా రంగంలో 60వ దశకంలో చరిత్ర సృష్టించిన గుండమ్మ కథ చిత్రం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర కథానాయిక అలనాటి అందాల నటి జమునకు అభినందన, ఆత్మీయ సత్కారం బుధవారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జరిగింది. ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి ఆకృతి సుధాకర్‌తో కలిసి జమునను ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘గుండమ్మ కథ’ వచ్చి 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఇంటిల్లిపాది టీవీల్లో ఈ చిత్రాన్ని ఉత్సాహంగా చూస్తున్నారన్నారు. అగ్రనటుల కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిందన్నారు. ఇందులో నటించి జీవించి ఉన్న ఒకరిద్దరిలో జమున ఒకరన్నారు. ఆమె చిరకాలం సంతోషంగా జీవించాలని వీలైయితే సినిమాల్లో నటించి తనలాంటి అభిమానులను అలరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. జమున మాట్లాడుతూ.. అప్పటి నటుల మధ్య ఆత్మీయ భావాలు ఉండేవన్నారు. గయ్యాళిగా కనిపించే ‘గుండమ్మ’ పాత్రధారి సూర్యకాంతం ఎంతో మంచివారని, షూటింగ్ సమయంలో క్యారేజీలు తెచ్చి నటీనటులందరికీ తానే వడ్డించేవారన్నారు. కార్యక్రమంలో జమున కూతురు కళాకారిణి స్రవంతి పాల్గొన్నారు.
చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు
వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment