
20 కోట్లు ఖర్చు చేసి ఈటలను హత్య చేసేందుకు కుట్ర పన్నారని..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలకు దిగారు. తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె ఆరోపించారు.
కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌పై ఈటల జమున మండిపడ్డారు. అలాగే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికంగా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కో హఠావో.. తెలంగాణకో బచావో